కుత్బుల్లాపూర్, జూ న్4 : ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల కల్పనలో శాశ్వత పరిష్కారం అందేలా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సూచించారు. శుక్రవారం జీడిమెట్ల డివిజన్ పరిధిలోని రామరాజునగర్ కాలనీలో నూతనంగా చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులను జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు భూగర్భడ్రైనేజీని మరింత పెంచాల్సిన అవసరం ఉందని అధికారులకు వివరించారు. భవిష్యత్‌లో సైతం ప్రజలకు అందుబాటులో ఉండేలా నిర్మాణ పనులను చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఈఈ కృష్ణచైతన్య, ఏఈ సురేందర్‌నాయక్, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు శ్రీనివాస్‌రెడ్డి, సత్యాగౌడ్ తదితరులు ఉన్నారు.