కుత్బుల్లాపూర్,అక్టోబర్19 : ఉత్సవాలకు, సామాజిక కార్యక్రమాలకు కేంద్రంగా కురుమ సంఘం భవనాన్ని నిర్మించి ఇస్తానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. 132 జీడిమెట్ల డివిజన్ బీరప్ప నగర్లో కామరాతి బీరప్ప స్వామి దేవాలయం ప్రాంగాణంలో నూతనంగా తన సొంత ఖర్చులతో నిర్మించేస్తున్న కమ్యూనీటిహాల్ భవనాన్ని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆదివారం సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యేను అనంతరం కమిటీ ప్రతినిధులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం చైర్మన్ నార్లకంటి నాగేశ్, అధ్యక్షులు చంద్రయ్య, ప్రధాన కార్యదర్శి చెవ్వ మహేందర్, కోశాధికారి విష్ణు, గొరిగె యాదయ్య, సత్తయ్య, పెంటయ్య, ఉలిపి మల్లేశ్, నార్లకంటి దుర్గయ్య, బాలయ్య, ప్రసాద్, బాలమల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.