కుత్బుల్లాపూర్,డిసెంబర్22 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. సోమవారం దండముడిలోని తన నివాసంలో నియోజకవర్గానికి చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, మాజీ ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతిపత్రాలను అందించారు.
అనంతరం వివిధ శుభకార్యలయాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు అభివృద్ధి నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసేలా నిరంతరం తగు చర్యలు తీసుకుంటున్నాని తెలిపారు.