దుండిగల్,ఆగష్టు7 : చదువుతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానంలో రాణించే విద్యార్థులకు భవిశ్యత్ ఉజ్వలంగా ఉంటుందని బీఆర్ఎస్ ఎల్పీవిప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. సూరారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో అత్యాధునికంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు తమ భవిశ్యత్ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడంలో కంప్యూటర్ పరిజ్ఞానం తోడ్పాటునందిస్తుందన్నారు.
ఇందుకోసం పాఠశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్య ద్వారా దేనినైనా సాధించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ మంత్రిసత్యనారాయణ, మేడ్చల్ జిల్లా ఫిషరిష్ కో-ఆపరేటివ్ సంస్థ చైర్మన్ మన్నేరాజు ముదిరాజు, మాజీ కార్పొరేటర్ జీ.సురేశ్‌రెడ్డి, డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్, నాయకులు బాలేష్, శ్రీనివాస్‌రెడ్డితో పాటు పాఠశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.