MLA KP vivekanand | దుండిగల్, మే 28: దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని రోడ్డు విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి వివేకానంద్ అన్నారు. బుధవారం దుండిగల్ మున్సిపాలిటీ కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాలలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే వివేకానంద్ మాట్లాడుతూ.. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని గండిమైసమ్మ – మియాపూర్ , బహదూర్ పల్లి – కొంపల్లి రోడ్డు విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అన్నారు. అదేవిధంగా మల్లం పేట్ రోడ్డు విస్తరణ పనుల్లో అడ్డంకిగా ఉన్న విద్యుత్ స్తంభాల మార్పు వంటి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, తద్వారా ట్రాఫిక్ రద్దీని తగ్గించవచ్చన్నారు.
మున్సిపాలిటీ పరిధిలోని అన్నీ వార్డుల్లో మిగిలిపోయిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి దుండిగల్ మున్సిపాలిటీని ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా అభివృద్ధి పరచాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్ నాయక్, ట్రాఫిక్ ఏసీపీ గిరి ప్రసాద్, గండి మైసమ్మ దుండిగల్ మండలం ఎమ్మార్వో మతిన్, జీడిమెట్ల ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు..
-నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఏడవ డివిజన్ శ్రీనివాస్ నగర్ లో గల అయ్యప్ప స్వామి దేవాలయం 2వ వార్షికోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై హరిహర సుతుడు అయ్యప్పకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వేడుకల్లో అరుణ్ గురు స్వామి, బ్రహ్మ శ్రీ రాజన్ నంబూద్రి గురు స్వామి, నాగార్జున ఆచార్యులు (లాలూ స్వామి)తో పాటు ఆలయ కమిటీ చైర్మన్ కోలన్ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, నిజాంపేట్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్, మాజీ కార్పొరేటర్లు ప్రణయ యాదవ్, రఘూవేంద్ర రావు, రవి కిరణ్, బాలాజీ నాయక్,బొర్రా దేవి చందు ముదిరాజ్,ఆలయ కమిటీ సభ్యులు ఉంగరాల శ్రీనివాస్, హరి బాబు, యువ నాయకులు ఆనంద్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, మహిళా నాయకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
KTR | మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ నివేదిక బూటకమని తేలిపోయింది : కేటీఆర్
Bad Breath | నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిట్కాలను పాటించండి..!
Jio Electric Scooter | మార్కెట్లో జియో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇవీ ఆ స్కూటర్ ప్రత్యేకతలు