MLA Bandari Laxma Reddy | రామంతాపూర్, ఫిబ్రవరి 21 : జలమండలి ప్రధాన కార్యాలయంలో జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డిని శుక్రవారం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పరిష్కారించాల్సిన డ్రైనేజీ వ్యవస్థ, వాటర్ వర్క్స్ సమస్యలపై, చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనుల కొరకై నిధుల మంజూరి గురించి చర్చించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎండీ హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అనేక సమస్యలపై పలువురు అధికారులను కలిసి వినతి పత్రాలు సమర్పించినట్లు, వాటి పరిష్కారానికి ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తున్నామన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే తమ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి, హౌసింగ్ బోర్డు కార్పొరేటర్ ప్రభుదాస్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు గంధం నాగేశ్వర్ రావు, భైరీ నవీన్ గౌడ్, నేమూరీ మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.