రామంతాపూర్, ఏప్రిల్ 17 : సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి వైస్ ఛాన్సలర్‌గా నియమితులైన ప్రొఫెసర్ వై.ఎల్. శ్రీనివాస్‌ను హబ్సిగూడలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఘనంగా సన్మానించారు. కాగా, హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషు విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యుడిగా, ఆరోరా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అకాడమీలో వైస్ ఛాన్సలర్‌గా ఆయన ప్రస్తుతం కొనసాగుతున్నారు. శాతవాహన, పాలమూరు విశ్వవిద్యాలయాల్లో బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గాను బాధ్యతలు నిర్వర్తించారు.
అలాగే నేషనల్ అసైన్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్(న్యాక్)కు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగాను పనిచేశారు. వీసీగా నియమితులైన ప్రొఫెసర్ వై.ఎల్. శ్రీనివాస్ కు అభినందనలు తెలిపారు. ఆయన అనుభవం గిరిజన విశ్వవిద్యాలయం పురోభివృద్ధికి దోహదపడాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సురేష్ కుమార్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.