శామీర్‌పేట, జూలై 1 : గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తూ పల్లె ప్రగతికి శ్రీకారం చుట్టిందని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. శామీర్‌పేట మండలం మురహార్పల్లి, తుర్కపల్లి గ్రామాల్లో గురువారం పల్లెప్రగతిలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం శివాలయం విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయం పైకప్పు నిర్మాణ పనులు చేపడుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి, జడ్పీటీసీ అనితలాలయ్య, వైస్ ఎంపీపీ సుజాత, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎండి.జహంగీర్, నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్‌రెడ్డి,రైతుబంధు మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, సర్పంచులు భాస్కర్, కవితావేణుగోపాల్రెడ్డి, మోహన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడి పాల్గొన్నారు.
ఘట్కేసర్ రూరల్, జూలై 1 : ప్రభుత్వం పల్లెలను పచ్చదనంతో పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి అన్నారు. మండల పరిధి… ఘనపూర్, అవుషాపూర్, అంకుషాపూర్ గ్రామాల్లో గురువారం పర్యటించారు. అనంతరం అంకుషాపూర్ గ్రామంలో 10 ఎకరాల విస్తీర్ణంలో పల్లెప్రకృతి వనానికి సంబంధించిన భూమిని పరిశీలించి, చర్యలు తీసుకోవాలని సంబంధిత తాసీల్దార్‌ను కలెక్టర్ ఆదేశించారు. అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్, జడ్పీ సీఈవో దేవసహాయం, జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, మండల ప్రత్యేకాధికారి సత్తార్, తాసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీవో అరుణ, సర్పంచులు కావేరి మచ్చేందర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, కొమ్మిడి జలజ పాల్గొన్నారు.
మేడ్చల్ జోన్ బృందం : మేడ్చల్ మండల పరిధిలో…గౌడవెల్లిలో సర్పంచ్ సురేందర్ ముదిరాజ్ అధ్యక్షతన నిర్వహించిన పల్లె ప్రగతిలో ఎంపీపీ పద్మాజగన్‌రెడ్డి మాట్లాడుతూ సీసీ కెమెరాలు, ఆలయాల వద్ద వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, పారిశుధ్యం మెరుగునకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. సర్పంచ్ సురేందర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ రణదీప్ రెడ్డి, ఎంపీడీవో శశిరేఖ పాల్గొన్నారు.
మండలం పరిధిలోని కీసర, తిమ్మాయిపల్లి, చీర్యాల్, యాద్గార్పల్లి, అంకిరెడ్డిపల్లి, రాంపల్లిదాయర, భోగారం, నర్సంపల్లి, కరీంగూడ తదితర గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా గ్రామసభలు నిర్వహించారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, ఆర్డీఓ రవికుమార్, డీఆర్డీఓ పద్మజరాణి, డీపీఓ రమణమూర్తి, డీఎల్పీఓ స్మిత, కీసర ఎంపీపీ ఇందిర, ఎంపీడీఓ పద్మావతి, ఎంపీఓ మంగతాయారు, సర్పంచులు మహేందర్‌రెడ్డి, మాధురి వెంకటేశ్, పెంటయ్య, ధర్మేందర్, రాజుముదిరాజ్, విమలనాగరాజు, కవితాజైహింద్రెడ్డి, సత్తమ్మ, కౌకుట్ల గోపాల్‌రెడ్డి, ఎంపీటీసీ కిరణ్‌జ్యోతి, వైస్ ఎంపీపీ సత్తిరెడ్డి పాల్గొన్నారు.
శామీర్‌పేట, మూడుచింతలపల్లి మండలాల్లో పల్లె ప్రగతి కార్యక్రమాలు నిర్వహించారు. పలు సమస్యలను గుర్తిం చడంతో పాటు మొక్కలు నాటారు. పత్యేక అధికారి శత్రు, ఎంపీడీఓ వాణి గరుదాస్, ఎంపీఓ సునీత, సర్పంచులు, డిప్యూటీ సీఈఓ, అధికారి సరిత, ఎంపీపీ హారికామురళీగౌడ్, ఎంపీడీఓ సువిధ పాల్గొన్నారు.
పల్లె ప్రగతి కార్యక్రమం సందర్భంగా కొర్రెముల, చౌదరిగూడ, కాచవానిసింగారం, ప్రతాపసింగారం, అవుషాపూర్, అంకుషాపూర్, ఎదులాబాద్, మర్పల్లిగూడ, మాదారం, వెంకటాపూర్ గ్రామాల్లో సర్పంచుల అధ్యక్షతన పల్లె ప్రగతి సందర్భంగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. సర్పంచ్‌లు వెంకటేశ్ గౌడ్,రమాదేవి రాము లు గౌడ్, వెంకట్ రెడ్డి, శివశంకర్, మచ్చేందర్ రెడ్డి, జలజ సత్యనారాయణ రెడ్డి, కాలేరు సురేష్, మంగమ్మ, యాదగిరి, గీతా శ్రీనివాస్, కార్యదర్శులు పాల్గొన్నారు.