బోడుప్పల్, జూన్ 26 : సీఎం సహాయనిధి నిరుపేదలకు వరమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. బోడుప్పల్ నగరపాలక సంస్థ 24వ డివిజన్ పరిధి గణేష్‌నగర్‌కు చెందిన కరుణాకర్‌కు సీఎం సహాయనిధి చెక్కు మంజూరైంది. శనివారం మేయర్ సామల బుచ్చిరెడ్డి సమక్షంలో లబ్ధిదారుడికి రూ. 24వేల చెక్కును మంత్రి అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గుర్రాల వెంకటేష్‌యాదవ్, కొత్త రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
శామీర్‌పేట, జూన్ 26 : జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 22వ డివిజన్‌కు చెందిన డి.వంశీకి మంజూరైన రూ. 60వేలు సీఎం సహాయనిధి చెక్కును శనివారం మంత్రి మల్లారెడ్డి క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బింగి లావణ్యసతీష్గౌడ్, మైనార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ యూసప్పఠాన్, అధ్యక్షుడు అలీఖాన్, లబ్ధిదారులు పాల్గొన్నారు.