Sambala | యువ హీరో ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటించిన సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ ‘శంబాల’ ప్రేక్షకులను థియేటర్లలో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. యగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ కీలక పాత్రలు పోషించారు. ఆసక్తికరమైన కథనం, మిస్టరీ ఎలిమెంట్స్‌తో కూడిన స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న థియేటర్లలో విడుదలైన ‘శంబాల’ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. భారీ అంచనాలు లేకపోయినా, పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ సాధించింది. ముఖ్యంగా మిస్టరీ, సూపర్ నేచురల్ థ్రిల్లర్ జానర్‌ను ఇష్టపడే ఆడియన్స్ ఈ సినిమాను ఆదరించారు. ఫలితంగా ‘శంబాల’ హిట్ లిస్టులో చేరింది.
థియేటర్లలో తెలుగులో విజయం సాధించిన తర్వాత, ఈ సినిమాను జనవరి 9న హిందీలో కూడా రిలీజ్ చేశారు. అక్కడ కూడా మంచి ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేయడానికి రెడీ అయింది.తాజాగా ఆహా ఓటీటీ వేదికగా ‘శంబాల’ డిజిటల్ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా జనవరి 22వ తేదీ నుంచి ఆహా ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. అంతేకాదు, ఆహా గోల్డ్ సబ్స్క్రిప్షన్ ఉన్నవారికి ఒక రోజు ముందుగానే, అంటే జనవరి 21 నుంచే ఈ సినిమా అందుబాటులో ఉంటుందని ఓటీటీ సంస్థ సోషల్ మీడియాలో వెల్లడించింది.
థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు, అలాగే సూపర్ నేచురల్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారు ఇప్పుడు ఓటీటీలో ‘శంబాల’ను చూసే అవకాశం పొందనున్నారు. ఇంట్లో కూర్చునే మిస్టరీ, సస్పెన్స్‌తో కూడిన ఈ థ్రిల్లర్‌ను ఆస్వాదించేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.