Kodi Pandem | సంక్రాంతి వచ్చిందంటే చాలు.. కోడి పందేలు హోరాహోరీగా సాగుతుంటాయి. ఈసారి కూడా ప్రజలు ఏమాత్రం తగ్గట్లేదు.. లక్షలు కాదు.. కోట్లలో డబ్బులు పెట్టి ఈ పందేలు ఆడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సంక్రాంతి పండుగ సందర్భంగా రెండో రోజు నిర్వహించిన కోడి పందేల్లో కోట్ల రూపాయల నగదు చేతులు మారినట్లు తెలుస్తోంది. పైబోయిన వెంకటరామయ్య బరిలో జరిగిన ఈ పందేల్లో రాజమండ్రి వాసి కోటిన్నర రూపాయలు గెలుచుకున్నాడు.
గుడివాడ ప్రభాకర్, రాజమండ్రి రమేశ్ కోళ్ల మధ్య గురువారం నాడు భారీ పందెం జరిగింది. ఈ పందెంలో కోట్ల రూపాయలు పందెంగా కాశారు. అయితే ఇందులో రాజమండ్రి రమేశ్ గెలిచారు. దీంతో రూ.1.53 కోట్లు సొంతం చేసుకున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఏడాది జరిగిన అతిపెద్ద పందెం ఇదేనని స్థానికులు చెప్పుకుంటున్నారు.