బోడుప్పల్, జూన్ 5: రాబోయే తరాల కోసం ప్రజలందరూ విరివిగా మొక్కలు నాటాలని కార్మిక, ఉపాధిశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శనివారం ప్రపం చ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బీఎల్నగర్లో బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, కమిషనర్ శ్రీనివాస్‌తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాటి న మొక్కలను కాపాడంతో పాటు వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నదన్నారు. అనంతరం బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో స్థానిక మేయర్ సామల బుచ్చిరెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొల్లిగూడెం, మహాలక్ష్మీనగర్ కాలనీలో పర్యటించి కబ్జాలకు గురైన పార్కు స్థలాలను పరిశీలించారు.
విచారణ జరిపి కబ్జాకు గురైన పార్కులను వెంటనే స్వాధీనం చేసుకుని, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కమిషనర్ బోనగిరి శ్రీనివాస్‌ను ఆదేశించారు.అదే విధంగా ద్వారకానగర్ ఫేస్-2, ఎస్బీఆర్ కాలనీ రోడ్డు నంబర్-3లో రూ.70లక్షలతో సీసీ రోడ్లు, భూగర్భడ్రైనేజీ మౌలిక వసతులపనులను మంత్రి స్థానిక మేయర్ బుచ్చిరెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం పలు డివిజన్లలో పర్యటించారు.ఆయా కార్యక్రమాల్లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడురాజశేఖర్రెడ్డి,బోడుప్పల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సంజీవరెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
ఘట్కేసర్ రూరల్,జూన్ 5: పర్యావరణాన్ని పరిరక్షించుకుంటేనే మానవులకు మనుగడ సాధ్యం అవుతుందని ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శనివారం మొక్కలు నాటి నీళ్లు పోశా రు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతిఒక్కరూ ప్లాస్టి క్ నిషేధించాలన్నారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పరిరక్షించినప్పుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యం అవుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో అరుణ, ఎంపీటీసీ రవి, మండల సహకార సంఘం డైరెక్టర్ చందుపట్ల ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శామీర్‌పేట, జూన్ 5: నాటిన ప్రతి మొక్కను కాపాడాలని తూంకుంట మున్సిపాలిటీ బీజేపీ నాయకులు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తూంకుంట మున్సిపాలిటీలోని దేవరయాంజాల్‌లో శనివారం మొక్కలు నాటారు. కార్యక్రమంలో హైమారెడ్డి, మహేశ్‌బాబు, శివకుమార్, దశరథ పాల్గొన్నారు.
కీసర, మే 5: కీసరగుట్ట ఫారెస్టును ఎంపీ సంతోష్‌కుమార్ దత్తత తీసుకొని ఏకో టూరిజంగా తయారు చేయడం చాలా అభినందనీయమని సర్పంచ్ మాధురీవెంకటేశ్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కీసరగుట్టలో ఏకో టూరిజం కింద ఎంపీ ఆధ్వర్యంలో జరిగిన పలు పనులను శనివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కీసరగుట్ట అటవీశాఖలో చేపట్టిన పలు రకాల పనులతో కీసరగుట్ట రూపురేఖలు పూర్తిగా మారిపోయాయన్నారు.
శామీర్‌పేట,జూన్ 5: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని డీఐజీపీ బ్రజేష్సింహ, కమాండెంట్ సునీల్‌కుమార్ అన్నారు. జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని సీఆర్పీఎఫ్ క్యాంప్‌లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని శనివారం నిర్వహించి క్యాంప్‌లో మొత్తం 450 మొక్కలు నాటారు. సోమవారం ప్లాంటేషన్ డ్రైవ్ జవాన్ల కుటుంబ సభ్యులతో నిర్వహిస్తామన్నారు.కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.