హైదరాబాద్ : మన ఊరు- మన బడి బిల్లులు చెల్లించలేదని ఓ కాంట్రాక్టర్ ప్రభుత్వ పాఠశాల భవనానికి తాళం వేశాడు.వివరాల్లోకి వెళ్తే..నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రంలో మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాల భవనాన్ని సురేష్ అనే కాంట్రాక్టర్ భవనం నిర్మించి రెండేళ్లు గడుస్తున్నాయి. కానీ, ప్రభుత్వం ఇప్పటి వరకు బిల్లులు విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాఠశాల భవనానికి తాళం వేసి నిరసన తెలిపాడు.
లక్షలాది రూపాయలకు వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నామని, ప్రభుత్వం కాంట్రాక్టర్లను వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైన తమ బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్ సురేష్ డిమాండ్ చేశారు. కాగా, గేటుకు తాళం వేయడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడ్డారు.
మన ఊరు మన బడి బిల్లులు చెల్లించలేదని ప్రభుత్వ పాఠశాల భవనానికి తాళం వేసిన కాంట్రాక్టర్
నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాల భవనాన్ని నిర్మించిన సురేష్ అనే కాంట్రాక్టర్
భవనం నిర్మించి రెండేళ్లు గడుస్తున్నా, ప్రభుత్వం బిల్లు కూడా… https://t.co/uhEadv83YU pic.twitter.com/5z4RJFw0uH
— Telugu Scribe (@TeluguScribe) January 19, 2026