Harish Rao | కాంగ్రెస్ ఔట్ సోర్సింగ్ సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు విమర్శించారు. ఔట్ సోర్సింగ్ సీఎం, అసలైన కాంగ్రెస్ నాయకుల మధ్య పంచాయతీ జరుగుతుందని తెలిపారు. ఒకరేమో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వీరవిధేయులం అని.. ఒకాయన చంద్రబాబుకు వీరవిధేయులమని అంటున్నారని పేర్కొన్నారు. ఇద్దరూ తెలంగాణకు బద్ధ వ్యతిరేకులే అని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మాట్లాడుతూ.. సింగరేణి నైని బొగ్గు గని టెండర్ల వ్యవహారంలో పూర్తి వివరాలను త్వరలోనే బయటపెడతానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారని గుర్తుచేశారు. పూర్తి వివరాలు వెల్లడించకపోతే వాటాల మధ్య సయోధ్య కుదిరినట్లే అని తెలిపారు. ఇప్పటికైనా నైని స్కాం వెనుక ఎవరు ఉన్నారో పూర్తి వివరాలను భట్టి విక్రమార్క వెల్లడించాలని డిమాండ్ చేశారు. నైని బొగ్గు ని టెండర్లపై పూర్తి వివరాలతో హైకోర్టును ఆశ్రయిస్తామని హరీశ్‌రావు తెలిపారు.
నైని స్కాం వెనుక ఎవరున్నారు అనేది భట్టి విక్రమార్క బయటపెట్టాలి
తెలంగాణలో సీఎం ఏమో చంద్రబాబు నాయుడుకి పరమ భక్తుడిని అని అంటాడు.. డిప్యూటీ సీఎం ఏమో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వీర విధేయుడిని అని అంటున్నాడు
తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకులు ఇద్దరికి మన సీఎం, డిప్యూటీ సీఎం భక్తులుగా… https://t.co/Z9BEQ6qija pic.twitter.com/7f47VPHvYb
— Telugu Scribe (@TeluguScribe) January 19, 2026
గతంలో దండుపాళ్యం ముఠా అంటే ఎంతో గోల చేశారని హరీశ్‌రావు గుర్తుచేశారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి మధ్య వాటాల పంచాయతీ బయటపడిందని తెలిపారు. వాటాల కోసం తన్నుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. మీ వాటాల కోసం జర్నలిస్టులు, ఐఏఎస్‌లను బలి చేస్తున్నారని మండిపడ్డారు. మేడారం టెండర్లపై మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస రెడ్డి కొట్టుకోలేదా అని ప్రశ్నించారు. దేవాదాయ శాఖ నుంచి ఆర్‌అండ్‌బీకి టెండర్లు మార్చలేదా అని నిలదీశారు. హోలోగ్రామ్‌పై ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి మధ్య పంచాయతీ జరిగిందని తెలిపారు. సినిమా రేట్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి మధ్య గొడవ జరిగిందన్నారు. ఈ విషయంలో విబేధాలు ఉన్నాయని కోమటిరెడ్డే చెప్పారని తెలిపారు. ఆరు గ్యారంటీలు అటకెక్కాయని.. వాటాల పంచాయితీ ముందుకొస్తుందని విమర్శించారు.
నైని స్కాం వెనుక ఎవరున్నారు అనేది భట్టి విక్రమార్క బయటపెట్టాలి
తెలంగాణలో సీఎం ఏమో చంద్రబాబు నాయుడుకి పరమ భక్తుడిని అని అంటాడు.. డిప్యూటీ సీఎం ఏమో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వీర విధేయుడిని అని అంటున్నాడు
తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకులు ఇద్దరికి మన సీఎం, డిప్యూటీ సీఎం భక్తులుగా… https://t.co/Z9BEQ6qija pic.twitter.com/7f47VPHvYb
— Telugu Scribe (@TeluguScribe) January 19, 2026
టెండర్ల వ్యవహారంలో 2024లో సైట్ విజిట్ విధానాన్ని తీసుకొచ్చేందే రేవంత్ రెడ్డి ప్రభుత్వమని హరీశ్‌రావు తెలిపారు. సింగరేణిలో సైట్ విజిట్ గతంలో ఎప్పుడూ లేదని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో టెండర్ మైనస్ 10 నుంచి 20 వరకు వెళ్లిందని తెలిపారు. రేవంత్ వచ్చినంక ప్లస్ 7 నుంచి ప్లస్ 10కు వెళ్తుందని అన్నారు. గతంలో ఏ రాష్ట్రం నుంచైనా టెండర్ వేసే అవకాశం ఉండేదని తెలిపారు. కానీ ఇప్పుడు సైట్ విజిట్ సర్టిఫికెట్ ద్వారా ఎవరు టెండర్ వేస్తున్నారో తెలుస్తుందని పేర్కొన్నారు. దీంతో ఎవరు టెండర్ వేస్తారో వాళ్లను టెండర్ వేయకుండా చేస్తున్నారని అన్నారు. వాళ్లకు అనుకూలంగా ఉన్నవారికే టెండర్లు కట్టబెడుతున్నారని ఆరోపించారు.
నైనీ బ్లాక్ విషయంలో వాటాలు తేలక పంచాయతీ బయటకొచ్చిందని హరీశ్‌రావు తెలిపారు. సైట్ విజిట్‌పై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయని తెలిపారు. సింగరేణిలో బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన టెండర్లను రద్దు చేస్తున్నారని పేర్కొన్నారు. అదే కాంట్రాక్టర్లతో కంపెనీ పేరు మార్చి ప్లస్ 10కి పైగా టెండర్ వేస్తున్నారని చెప్పారు. శ్రీరాంపూర్‌లో మైనస్ టెండర్ నుంచి ప్లస్ టెండర్ చేస్తున్నారని విమర్శించారు. రింగ్ చేసి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారని తెలిపారు. డీజిల్‌ను కూడా కాంట్రాక్టర్ల ఖాతాలోనే కలుపుతున్నారని అన్నారు. పెద్ద ఎత్తున కమీషన్ కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రూ.100 కోట్లకు జీఎస్టీ కడితే సింగరేణికి నష్టం జరుగుతుందని అన్నారు.
బీజేపీకి రేవంత్ రెడ్డికి అక్రమ సంబంధం లేకపోతే ఈ నైని బ్లాక్ టెండర్ల రద్దు మీద సీబీఐ విచారణకు.. బీజేపీ పార్టీ, కిషన్ రెడ్డి ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నాను
మీరు సీబీఐ విచారణకు ఆదేశిస్తే నా దగ్గర ఉన్న అన్ని ఆధారాలను సబ్మిట్ చేస్తాను – హరీష్ రావు https://t.co/OHSbdOWeHD pic.twitter.com/WJnA69asrv
— Telugu Scribe (@TeluguScribe) January 19, 2026
సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడు, అత్యంత సమీప బంధువు కనుసన్నల్లోనే అంతా జరుగుతుందని హరీశ్‌రావు ఆరోపించారు. ఆ బంధువు చెబితేనే విజిట్ సర్టిఫికెట్ వస్తుందని అన్నారు. ఈ వ్యవహారంపై రేవంత్ రెడ్డి వెంటనే సీబీఐ విచారణ కోరాలన్నారు. కోల్ ఇండియా మంత్రి కిషన్ రెడ్డి సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. తన దగ్గర ఉన్న పూర్తిస్థాయి సమాచారాన్ని ఇస్తానని తెలిపారు.
సింగరేణికి ఇప్పటివరకు పూర్తిస్థాయిలో సీఎండీ లేడని హరీశ్‌రావు అన్నారు. వెంటనే పూర్తిస్థాయిలో సింగరేని సీఎండీని నియమించాలని డిమాండ్ చేశారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ లేదని భట్టి విక్రమార్క నైనీ బ్లాక్ టెండర్ రద్దు చేశారని తెలిపారు. సైట్ విజిట్ లేని అన్ని సింగరేణి కాంట్రాక్టులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.