పీర్జాదిగూడ, సెప్టెంబర్16 : పీర్జాదిగూడ కార్పొరేషన్‌ను రాష్ట్రంలోనే అభివృద్ధిలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం పీర్జాదిగూడ పరిధిలో సుమారు రూ. 4.26 కోట్ల మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, కార్పొరేటర్లతో కలిసి మంత్రి ప్రారంభించారు. మొదటి డివిజన్లో శ్మశాన వాటిక, పలు డివిజన్లలో సీసీ రోడ్డు పనులు, 14వ డివిజన్లో సీసీ కెమెరాలు, 19వ డివిజన్లో పార్కు అభివృద్ధి పనులు, 25వ డివిజన్ ప్రభుత్వ పాఠశాలలో అదనపు అంతస్తు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో రూ.1.50 కోట్లతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
మేడ్చల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే నిధులు ఐదు కోట్లు మంజూరయ్యాయని, అందులో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ. 2కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, కమిషనర్ శ్రీనివాస్, పార్టీ అధ్యక్షుడు దర్గ దయాకర్‌రెడ్డి, కార్పొరేటర్లు హరిశంకర్ రెడ్డి, నవీన్‌రెడ్డి, అనంతరెడ్డి, సుభాష్ నాయక్, శారద ఈశ్వర్‌రెడ్డి, యుగేందర్‌రెడ్డి, , మంజుల రవీందర్, శశిరేఖ బుచ్చియాదవ్, అమర్‌సింగ్, కౌడె పోచయ్య, సరిత దేవేందర్‌గౌడ్, బండి రమ్య సతీశ్‌గౌడ్, రఘుపతిరెడ్డి నాయకులు, శ్రీధర్‌రెడ్డి, అంజిరెడ్డి, శ్రీకాంత్ గౌడ్, కోఆప్షన్ సభ్యులు కృష్ణగౌడ్, పెంటయ్య గౌడ్ పాల్గొన్నారు.