BCB : టీ20 ప్రపంచకప్ బెర్తు కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్న బంగ్లాదేశ్‌లో ఇప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ (Match Fixing) కలకలం రేపుతోంది. స్వదేశంలో జరుగుతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(BPL)లో బీసీబీ డైరెక్టరే ప్రమేయంతోనే ఫికింగ్స్ జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. దాంతో, ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న బోర్డు డైరెక్టర్ మొహమ్మద్ మొక్లెషురు రహ్మాన్‌పై విచారణకు ఆదేశించింది. ఫిక్సింగ్‌లో రెహ్మాన్ పాత్రపై అంతర్గత బృందం దర్యాప్తు చేయనుందని శుక్రవారం బంగ్లా బోర్డు వెల్లడించింది.
భారత్‌లో పొట్టి ప్రపంచకప్ ఆడబోమనే బంగ్లాదేశ్ బోర్డు నిర్ణయం తీసుకోవడంతో మొదలు.. ఆ దేశ బోర్డు నిత్యం వార్తల్లో నిలుస్తోంది. మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌ను ఇండియన్ ఏజెంట్ అని పేర్కొన్నందుకు సలహాదారుపై వేటు పడింది. ఇప్పుడేమో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌లో డైరెక్టర్ మొహమ్మద్ మొక్లెషురు రహ్మాన్ పాత్ర ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. రిసాయత్ అజీమ్ అనే యూట్యూబర్ తన చానెల్లో రెహ్మాన్‌కు, నోక్హలి ఎక్స్‌ప్రెస్ చైర్మన్ తౌహిదుల్ హక్కు మధ్య చీకటి ఒప్పందం జరిగిందనే విషయాన్ని వెల్లడించాడు. దాంతో, అప్రమత్తమైన బంగ్లా బోర్డు మ్యా్చ్ ఫిక్సింగ్‌లో రెహ్మాన్ పాత్రపై దర్యాప్తు చేయిస్తోంది.
బీసీబీ ఇంటెగ్రిటీ యూనిట్ అధ్యక్షుడు అలెక్స్ మార్షల్ మ్యాచ్ ఫిక్సింగ్పై దర్యాప్తు చేపడుతున్నారు. ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో రెహ్మాన్ బీసీబీ ఆడిట్ కమిటీకి రాజీనామా చేశారు అని బీసీబీ పేర్కొ్ంది. విచారణ సజావుగా జరగాలనే ఉద్దేశంతోనే నేను కమిటీకి, ఇతర బాధ్యతల నుంచి వైదొలిగాను. కానీ, డైరెక్టర్‌గా కొనసాగుతాను. ఫిక్సింగ్ గురించి సమగ్రమైన దర్యాప్తు జరగాలి అని రెహ్మాన్ అన్నారు.