IND vs NZ : పొట్టి ప్రపంచకప్లోపే భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(82 నాటౌట్) ఫామ్ అందుకున్నాడు. టీ20ల్లో తానొక సంచలనమని చాటుతూ రాయ్‌పూర్‌లో న్యూజిలాండ్ బౌలర్లకు తన విధ్వంసాన్ని కళ్లకు కట్టాడు. టీమిండియాపై రికార్డు స్కోర్ కొట్టి విజయంపై ధీమాగా ఉన్న కివీస్ ఆశల్ని ఆవిరి చేస్తూ అర్ధ శతకంతో రెచ్చిపోయాడు. ఇషాన్ కిషన్(76) మెరుపు హాఫ్ సెంచరీతో గట్టి పునాది వేయగా.. సూర్య, శివం దూబే(36 నాటౌట్) జోడీ కవీస్ బౌలర్లపై పిడుగల్లే విరుచుకుపడింది. దూబే భారీ సిక్సర్లతో బెంబేలెత్తించగా.. మిస్టర్ 360 తన క్లాస్ ఆటతో ప్రేక్షకులను ఊర్రూతలూగించాడు. ఫలితంగా వికెట్ల తేడాతో గెలుపొందిన టీమిండియా.. 2-0తో ఆధిక్యంలో దూసుకెళ్లింది.
పొట్టి ఫార్మాట్లో భారత జట్టు జోరుకు న్యూజిలాండ్‌కు రెండో ఓటమి తప్పలేదు. 206 పరుగులతో టీమిండియా ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది కివీస్. 6 పరుగులకే ఓపెనర్లు సంజూ శాంసన్(6) అభిషేక్ శర్మ(0)లు పెవిలియన్ చేరినా.. ఇషాన్ కిషాన్(76) తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీకి, స్టాండ్స్‌కు పంపిన ఈ చిచ్చరపిడుగు 21 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు.
HAMMERED and how! 🚀
🎥 Shivam Dube and Surya Kumar Yadav with a couple of massive maximums 😮
Updates ▶️ https://t.co/8G8p1tq1RC#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank | @IamShivamDube | @surya_14kumar pic.twitter.com/XGxSxTbiZm
— BCCI (@BCCI) January 23, 2026
మరో ఎండ్‌లో సూర్యకుమార్ యాదవ్( 82 నాటౌట్) సైతం పెట్రేగిపోయాడు. 9వ ఓవర్లో 4, 4, 4, 4, 6, 2తో 24 రన్స్ పిండుకున్నాడు. ఏడాది తర్వాత మునపటి సూర్యను తలపించిన అతడు 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇషాన్ ఔటయ్యాక శివం దూబే(36 నాటౌట్) ఉప్పెనలా కివీస్ స్పిన్నర్లను హడలెత్తించాడు. సోధీ ఓవర్లో అతడు ఏకంగా 100 మీటర్ల సిక్సర్‌తో చెలరేగాడు. ఈ జోడీ విధ్వంసానికి 16.2 ఓవర్లలోనే టీమిండియా మ్యాచ్‌ను ముగించి సిరీస్‌లో 2-0తో ముందంజలో ఉంది.
Commanding the contest 🫡
2⃣2⃣nd T20I fifty for captain Surya Kumar Yadav 🙌#TeamIndia need 66 runs from 56 deliveries.
Updates ▶️ https://t.co/8G8p1tq1RC#INDvNZ | @IDFCFIRSTBank | @surya_14kumar pic.twitter.com/LEjU1VcEra
— BCCI (@BCCI) January 23, 2026
తొలి టీ20లో కంగుతిన్న న్యూజిలాండ్‌కు రాయ్‌పూర్‌లో ఓపెనర్లు డెవాన్ కాన్వే(19), టిప్ సీఫర్ట్(24)లు శుభారంభమిచ్చారు. అర్ష్‌దీప్ సింగ్ ఓవర్లో మూడు ఫోర్లు, సిక్సర్‌తో 18 రన్స్ పిండుకున్నాడు కాన్వే. హర్షిత్ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో చెలరేగాడు సీఫర్ట్. వీరిద్దరి జోరుతో ఓవర్‌కు పది చొప్పున రన్స్ రాగా నాలుగో ఓవర్లోనే స్కోర్ 40 దాటింది. ఈ ద్వయాన్ని రానా విడదీశాడు. కాసేపటికే వరుణ్ ఓవర్లో భారీ షాట్ ఆడాలనుకున్న సీఫర్ట్ .. చేతికి చిక్కాడు. కానీ, రచిన్ రవీంద్ర(44) ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడి గ్లెన్ ఫిలిప్స్ (19)తో కలిసి25 బంతుల్లోనే 50 రన్స్ జోడించారు.
డేంజరస్ ఫిలిప్స్‌ను కుల్దీప్ వెనక్కి పంపగా.. వన్డేల్లో దంచసిన డారిల్ మిచెల్(18)ను శివం దూబే డగౌట్ చేర్చడంతో స్కోర్ వేగం తగ్గింది. అర్ధ శతకానికి చేరువైన రవీంద్రను .. చాప్మన్ ఔటయ్యాక కెప్టెన్ శాంట్నర్(47 నాటౌట్) ధనాధన్ ఆటతో దడపుట్టించాడు. డెత్ ఓవర్లలో బౌండరీలతో చెలరేగిన కివీస్ సారథి.. జకరీ ఫౌల్కీస్(15 నాటౌట్)తో కలిసి 19 బంతుల్లోనే 47 రన్స్ జోడించాడు. దాంతో.. భారత్‌పై టీ20ల్లో న్యూజిలాండ్ రికార్డు స్కోర్ చేసింది. ఇదివరకూ 2017లో నమోదు చేసిన 196/2 అత్యధికంగా ఉండేది.