IND vs NZ : పొట్టి సిరీస్‌ను ఓటమితో ఆరంభించిన న్యూజిలాండ్ రెండో మ్యాచ్‌లో భారీ స్కోర్ చేసింది. రాయ్‌పూర్‌లో ఓపెనర్లు శుభారంభాన్ని రచిన్ రవీంద్ర (44) కొనసాగించగా.. మిచెల్ శాంట్నర్ ( 47 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. డెత్ ఓవర్లలో రెచ్చిపోయిన శాంట్నర్.. స్కోర్ దాటించాడు. ఆఖరి ఓవర్లో ఫౌల్కిస్(15 నాటౌట్) 6, 4 బాదగా కివీస్ 6 వికెట్ల నష్టానికి 208 రన్స్ చేసింది. పొట్టి క్రికెట్లో ఇండియాపై ఆ జట్టుకి ఇదే రికార్డు స్కోర్.
తొలి టీ20లో కంగుతిన్న న్యూజిలాండ్‌కు రాయ్‌పూర్‌లో ఓపెనర్లు డెవాన్ కాన్వే(19), టిప్ సీఫర్ట్(24)లు శుభారంభమిచ్చారు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్లో మూడు ఫోర్లు, సిక్సర్‌తో 18 రన్స్ పిండుకున్నాడు కాన్వే. ఆ తర్వాత హర్షిత్ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో చెలరేగాడు సీఫర్ట్. వీరిద్దరి జోరుతో ఓవర్‌కు పది చొప్పున రన్స్ రాగా నాలుగో ఓవర్లోనే స్కోర్ 40 దాటింది. ప్రమాదకరంగా మారిన ఈ ద్వయాన్ని రానా విడదీశాడు. కాసేపటికే వరుణ్ ఓవర్లో భారీ షాట్ ఆడాలనుకున్న సీఫర్ట్ .. చేతికి చిక్కాడు.
Clever and Tactical 😎
Kuldeep Yadav led #TeamIndia‘s bowling effort with impressive figures of 2⃣/3⃣5⃣ 👏👏
Updates ▶️ https://t.co/8G8p1tq1RC#INDvNZ | @IDFCFIRSTBank | @imkuldeep18 pic.twitter.com/fryjSibGwV
— BCCI (@BCCI) January 23, 2026
కానీ, రచిన్ రవీంద్ర(44) ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడి.. గ్లెన్ ఫిలిప్స్ (19)తో కలిసి 25 బంతుల్లోనే 50 రన్స్ జోడించారు. డేంజరస్ ఫిలిప్స్‌ను కుల్దీప్ వెనక్కి పంపగా.. వన్డేల్లో దంచసిన డారిల్ మిచెల్(18)ను శివం దూబే డగౌట్ చేర్చడంతో స్కోర్ వేగం తగ్గింది. అర్ధ శతకానికి చేరువైన రవీంద్రను .. చాప్మన్ ఔటయ్యాక కివీస్ రెండొందల లోపే పరిమితం అవుతుందనిపించింది. కానీ, కెప్టెన్ శాంట్నర్(47 నాటౌట్) ధనాధన్ ఆటతో దడపుట్టించాడు. డెత్ ఓవర్లలో బౌండరీలతో చెలరేగిన కివీస్ సారథి.. జకరీ ఫౌల్కీస్(15 నాటౌట్)తో కలిసి 19 బంతుల్లోనే 47 రన్స్ జోడించాడు. దాంతో.. భారత్‌పై టీ20ల్లో న్యూజిలాండ్ రికార్డు స్కోర్ చేసింది. ఇదివరకూ 2017లో నమోదు చేసిన 196/2 అత్యధికంగా ఉండేది.