జవహర్‌నగర్, సెప్టెంబర్ 11: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని 7వ డివిజన్‌కు చెందిన భారతమ్మ, కనకయ్యకు వైద్య సహాయ నిమిత్తం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. వారికి మంజూరైన చెక్కులను కార్పొరేటర్ మెట్టు ఆశాకుమారి, డివిజన్ అధ్యక్షుడు మెట్టు వెంకన్న ఆధ్వర్యంలో లబ్ధిదారుల కుటుంబసభ్యులకు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద ప్రజలకు సీఎం సహాయనిధి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. కార్యక్ర మంలో కాలనీ నాయకులు పాల్గొన్నారు.
బోడుప్పల్ : ‘సీఎం సహాయనిధి’ పేదల పాలిట పెన్నిధిగా మారిందని బోడుప్పల్ 1వ డివిజన్ కార్పొరేటర్ బింగి జంగయ్యయాదవ్ అన్నారు. బోడుప్పల్ నగరపాలక సంస్థ ఒకటో డివిజన్‌కు చెందిన వి.కృష్ణచారి వైద్య సహాయ నిమిత్తం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా చెక్కు మంజూరైంది. ఈ చెక్కును కార్పొరేటర్ జంగయ్యయాదవ్ లబ్ధిదారుడికి శనివారం తన నివాసంలో అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
కీసర : మండల కేంద్రానికి చెందిన పూండ్రు రమేశ్ వైద్య సహాయ నిమిత్తం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా చెక్కు మంజూరైంది. ఈ చెక్కును కీసర మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జె.సుధాకర్‌రెడ్డి లబ్ధిదారుడికి శనివారం అందజేశారు. కార్యక్రమంలో కీసరకు చెందిన టీఆర్ఎస్ యూత్ నాయకులు పాల్గొన్నారు.