ఘట్కేసర్,ఆగస్టు13: పేద ప్రజలకు ‘సీఎంఆర్ఎఫ్’ వరం లాంటిదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. పోచారం మున్సిపాలిటీకి చెందిన అన్వేష్, స్వప్న, సురేందర్, లలిత, ఘట్కేసర్ మున్సిపాలిటీకి చెందిన డి.ఉపేందర్, అమర్నాథ్, కె.రాజుకు వైద్య సహాయం నిమిత్తం సీఎం సహాయనిధి నుంచి చెక్కులు మంజూరయ్యాయి. ఈ చెక్కులను మంత్రి మల్లారెడ్డి శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. సీఎంఆర్ఎఫ్ పేదలకు మేలు చేస్తున్నదని తెలిపారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ పావనీ జంగయ్య యాదవ్,పోచారం చైర్మన్ కొండల్‌రెడ్డి, ఘట్కేసర్ టీఆర్ఎస్ అధ్యక్షుడు బి.శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.