మేడ్చల్, ఆగస్టు 11: సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలను ఆదుకుంటున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయంలో బుధవారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు మంత్రి బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. 70 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ఏనాడైనా పేదల సంక్షేమం కోసం ఇలాంటి పథకాలు అమలు చేసిందా? అని మంత్రి ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలున్న రాష్ర్టాల్లో దమ్ముంటే తెలంగాణలో అందిస్తున్న పథకాలు అమలు చేసి చూపించాలన్నారు. కార్యక్రమంలో మేడ్చల్ జడ్పీటీసీ శైలజా విజయానందరెడ్డి, మున్సిపల్ చైర్మన్ దీపికా నర్సింహా రెడ్డి, వైస్ చైర్మన్ రమేశ్, పీఏసీఎస్ చైర్మన్ రణదీప్‌రెడ్డి, సర్పంచ్ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయానందరెడ్డి, టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు శేఖర్‌గౌడ్, నాయకులు నర్సింహా రెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
మేడ్చల్ రూరల్ : ఆడబిడ్డలకు అండగా ఉండి సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 15 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చైర్పర్సన్ లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రభాకర్, కౌన్సిలర్లు మల్లికార్జున్ ముదిరాజ్, జైపాల్‌రెడ్డి, బాలరాజు, పెంటయ్య, రజితావెంకటేశ్, రాజకుమారి , ఆంథోనమ్మఫిలిప్స్, కోఆప్షన్ సభ్యురాలు జయశ్రీ ,కమిషనర్ అమరేందర్ రెడ్డి, డీఈఈ చింజీవులు పాల్గొన్నారు.
శామీర్‌పేట : ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. శామీర్‌పేట మండలం లాల్‌గడి మలక్‌పేట ఆనంద్‌నగర్‌కు చెందిన దమయంతికి వైద్య సహాయం నిమిత్తం సీఎం సహాయనిధి రూ.60 వేల చెక్కు మంజూరైంది. ఈ చెక్కును మంత్రి బుధవారం అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అనితలాలయ్య, కుమార్ పాల్గొన్నారు.