Marri Rajashekar Reddy | మల్కాజిగిరి, మార్చి 17 : హిందూ స్మశాన వాటికను చెత్త డంపింగ్ యార్డ్‌గా మార్చడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీ ఇవాళ బొల్లారంలోని హిందూ స్మశాన వాటికను చెత్త డంపింగ్ యార్డ్‌గా మార్చడానికి నిరసనగా.. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి రెండవ రోజు చెత్తలో కూర్చొని నిరసన కొనసాగించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. స్మశానవాటికలోని అక్రమ డంపింగ్ యార్డును తొలగించి, అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని అన్నారు. స్టాప్ ఇల్లీగల్ డంపింగ్ ఇన్ హిందూ గ్రేవ్ యార్డ్ అనే నినాదంతో దాదాపు నలభై కాలనీల ప్రజలతో కలిసి ధర్నా నిర్వహిస్తున్నామని అన్నారు. హిందూ సాంప్రదాయాలను మనోభావాలను లెక్క చేయకుండా అధికారులు ఇష్టానుసారం వ్యవహించడం సమంజసం కాదని అన్నారు.
డంపింగ్ యార్డ్‌లో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన భయంకరమైన చెత్త వల్ల ప్రజాజీవనం కాలుష్యభరితమై, చిన్న పిల్లలు, వృద్ధుల ఆరోగ్యాలు ప్రశ్నార్థకంగా మారాయని.. భూగర్భ జలాలు, పర్యావరణం పూర్తిగా కాలుష్య భరితంగా మారిందన్నారు. అధికారులు కార్పొరేట్ సంస్థలకు తొత్తులుగా పనిచేయడం మానుకోవాలని అన్నారు.
సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ప్రతీ రోజూ ధర్నా నిర్వహిస్తామని, అవసరమైతే అల్వాల్ బల్దియా కార్యాలయాన్ని ముట్టడిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లి అవినీతి అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి , రమేష్, పరమేష్, అనిల్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
డంపింగ్ యార్డ్ తొలగించాలని చెత్తకుప్పలో కూర్చుని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ధర్నా
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మచ్చ బొల్లారంలో శ్మశాన వాటికలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడంపై స్థానికుల వ్యతిరేకత
స్థానికులకు మద్దతుగా చెత్తకుప్పలో కూర్చుని నిరసన తెలుపుతూ,… pic.twitter.com/NrjEThtnM0
— Telugu Scribe (@TeluguScribe) March 17, 2025
Read Also :
HYDRAA | బండ్లగూడలో హైడ్రా కూల్చివేతలు
ASP Chittaranjan | విద్యార్థులు ఒత్తిడిని అధిగమిస్తేనే విజయం తథ్యం : ఏఎస్పీ చిత్తరంజన్
Harish Rao | కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్: హరీశ్‌రావు