kuchipudi | రామంతాపూర్, మే 25 : ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా గురువు పావని శ్రీలత ప్రసాద్ శిష్యబృందంతో కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది.
రంగ పూజ, విన్నపాలు, పుష్పాంజలి, ఇదిగో భద్రాద్రి, శాంకరి శంకరుడు, నమశ్శివాయ, హిమగిరి, రామాయణ శబ్దం తదితర అంశాలను విముక్త, సుహాని, నిధ్విక, శాన్వి, చైత్ర, జెశ్విత , దేవి లత, మాధవి, అనుశఙ్కయా, ఆధ్య, తరుణీ, అడవిత, సమన్విత, హంసిని ప్రదర్శించి ఆహుతులను మెప్పించారు.