మేడ్చల్, డిసెంబరు 15 : రాంపల్లిలోనే బస్తీ దవాఖాన కొనసాగించాలని కోరుతూ నాగారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి స్థానికులతో కలిసి సోమవారం అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాంపల్లిలోని బస్తీ దవాఖాన పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య సేవలందిస్తుందన్నారు.
దవాఖానాను నాలుగు కిలోమీటర్ల దూరానికి తరలిస్తే వారు ఎలా వెళ్లగలరని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజా ఆరోగ్యంపై చిత్తశుద్ధి లేదని, కేంద్ర నిధులు రూ.1.40 కోట్ల స్థానికంగా నిర్మించిన దవాఖానాను నిధులు లేవనే సాకుతో నిర్మాణం పూర్తయినా ప్రారంభించడం లేదని, సిబ్బందిని నియమించడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రవీందర్ రెడ్డి, కిషోర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.