కడ్తాల్, అక్టోబర్ 9 : కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడంతోనే కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గడ్డమీది తండాకి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ వార్డు సభ్యుడు విస్లావత్ అమృనాయక్ దశరథ్ నాయక్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఆయనకు దశరథ్నాయక్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా దశరథ్నాయక్ మాట్లాడుతూ తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికే కాంగ్రెస్ పార్టీ ఆచరణకు సాధ్యం కానీ హామీలను ఇచ్చిందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్రెడ్డి ప్రకటించిన అబద్ధపు హామీలను, మోసాలను, మాయమాటలను రాష్ట్ర ప్రజలు గుర్తించారని తెలిపారు. సమస్యలపై ప్రజల దృష్టిని మళ్లించడానికే కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనను తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు రామకృష్ణ, పీఏసీఎస్ డైరెక్టర్ సేవ్యానాయక్, మాజీ సర్పంచ్లు హరిచంద్నాయక్, శ్వేతభూనాథ్నాయక్, నాయకులు పంతూనాయక్, రమేశ్నాయక్, ఎల్లాగౌడ్, శ్రీను, మహేశ్, మల్లేశ్, కిషన్, పాండు, ఆమ్జాద్, సరియానాయక్, రవి, దశరథ్, జైపాల్, జగన్, మదన్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.