Jogini Sandhya | మేడ్చల్, ఏప్రిల్ 17 : అఘోరిగా చెలామణి అవుతూ ప్రజలను మోసం చేస్తున్న అఘోరి అలియాస్ శ్రీనివాస్ అలియాస్ శివ విష్ణు బ్రహ్మ అల్లూరిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మూడుచింతలపల్లి మండలం కేశవరం గ్రామానికి చెందిన జోగిని సంధ్య ఇవాళ శామీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జోగిని సంధ్య సీఐ శ్రీనాథ్‌ను కలిసి ఫిర్యాదు అందజేశారు.
ఈ సందర్భంగా జోగిని సంధ్య మాట్లాడుతూ.. సనాతన ధర్మం పేరు చెప్పుకొని ప్రజల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నాడని, శివశక్తులు, జోగినిలు, హిజ్రా వ్యవస్థకు చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. అతడు అఘోరికాదని, అసలు హిజ్రానే కాదన్నారు. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీలో ఆడపిల్లలాగా ఉండి, ఒక ఆడపిల్లను పెళ్లి చేసుకొని, తాజాగా వర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని హిజ్రాలకు మాయని మచ్చ తెచ్చాడన్నారు. ఈ ఘటనతో అతడి బండారం బయటపడిందన్నారు.
ప్రభుత్వం, పోలీసులు వెంటనే అఘోరిని అరెస్ట్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మం కాపాడాలంటే ఇలాంటి వాళ్లను సమాజం నుంచి తరిమి కొట్టాలని, బయట ఎక్కడా తిరగనివ్వొద్దని ప్రజలకు సంధ్య విజ్ఞప్తి చేశారు. అతడికి మద్ధతు పలుకుతున్న వారిని సైతం బయటికి తీయాలని డిమాండ్ చేశారు.
తప్పు చేసిన అతడిని శిక్షించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్నారు. నేను మొదటి నుంచి అఘోరి అలియాస్ శ్రీనివాస్‌పై పోరాటం చేస్తున్నానని, కత్తులతో దాడి చేసినా ఎలాంటి చర్య తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా సీఐ శ్రీనాథ్ మాట్లాడుతూ జోగిని సంధ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Minister Ponguleti | భూ వివాదాలు లేని రాష్ట్రంగా భూ భారతి చట్టం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Amit Shah: సీఆర్పీఎఫ్ 86వ రైజింగ్ డే.. 2026 నాటికి నక్సలిజం ఇక చరిత్రే: అమిత్ షా
Illegally Sand | అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను సీజ్ చేసిన తహసీల్దార్ అనిత