JNTUH Students | కేపీహెచ్బీ కాలనీ, మార్చి 18 : రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ విద్యార్థులు ఇవాళ వినతి పత్రం అందించారు. యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థుల ఫెలోషిప్, పెండింగ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్, టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు.
స్కాలర్ షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని కోరారు. అలాగే యూనివర్సిటీలో నిర్మిస్తున్న ఎస్టీ హాస్టల్ తొందరగా పూర్తి చేయాలని.. పోటీ పరీక్షల కోసం కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు లకావత్ భాను ప్రకాష్, ఆకాష్ నాయక్, సన్నీ, ఇమ్మానియేల్, సురేష్, సాయికిరణ్, భాను, ప్రేమ్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
MLC Kavitha | బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
Danam Nagender | సహచర ఎమ్మెల్యేలపై దానం నాగేందర్ సీరియస్
Amitabh Bachchan: షారూక్, విజయ్ను దాటేసిన బిగ్ బీ.. 120 కోట్ల ట్యాక్స్ కట్టిన అమితాబ్ బచ్చన్