నేరేడ్మెట్, ఆగస్టు 7 : బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు పెరుగుతు న్నాయి. అందులో భాగంగా గురువారం మల్కాజిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో వినాయకనగర్ డివిజన్ సమతానగర్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వైస్ ప్రెసిడెంట్ ధర్మేష్, యాదవ్, సంపత్ యాదవ్, భాను యాదవ్‌లతో పాటు 20మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వీరందకి మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పేదల సంక్షేమం కోసం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో జేఏసీ వెంకన్న, పంజా శ్రీకాంత్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.