Bowrampet | దుండిగల్, మార్చి19 : ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలపై గండి మైసమ్మ- దుండిగల్ మండల రెవెన్యూ అధికారులు కొరడా ఝలిపించారు. మండల పరిధిలోని బౌరంపేటలోని ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నట్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు వెలువెత్తాయి. దీంతో బుధవారం అధికారులు చర్యలకు ఉపక్రమించారు.
ఈ సందర్భంగా సర్వేనెంబర్ 575లో నిర్మించిన రెండు నిర్మాణాలతో పాటు 580లో నిర్మించిన మరో నిర్మాణాన్ని అధికారులు నేలమట్టం చేశారు. అదేవిధంగా మరో మూడు బేస్మెంట్లను కూల్చివేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.