MLA Bandari Lakshma Reddy | ఉప్పల్, జూన్ 5 : నాచారం డివిజన్లోని సాయినగర్‌లో భూగర్భ డ్రైనేజీ పనులకు గురువారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో నాచారం డివిజన్లో భూగర్భ డ్రైనేజీ సమస్యలు లేకుండా చూస్తామన్నారు.
సిమెంట్ రోడ్ల సమస్యలు లేకుండా డివిజన్‌ను ఉత్తమ డివిజన్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని.. సమస్యల పరిష్కారానికి నిధులు సమకూరుస్తున్నామని తెలియజేశారు. ఎమ్మెల్యే సహకారంతో డివిజన్ మరింత అభివృద్ధి చేసేందుకు తమ వంతు కృషి చేస్తున్నట్లు కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ప్రజా సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్నామని, సమస్యలను తమ దృష్టికి తీసుకు వస్తే తప్పక పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ కీర్తి, వినీత్, వర్క్ ఇన్స్పెక్టర్ విజయకుమార్, జలమండలి సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.
Collector Manu Chowdhury | రైతు మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ మను చౌదరి
Innovation Marathon | స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్‌కు సెయింట్ మేరీస్ పాఠశాల ఎంపిక
Harish Rao | బడా బాబుల కోసం బీద రైతుల కడుపు కొడుతారా..? రేవంత్ రెడ్డిని నిలదీసిన హరీశ్‌రావు