Traffic Jam| దుండిగల్, మార్చి19 : మియాపూర్-గండి మైసమ్మ చౌరస్తా రోడ్డులో ఇవాళ మధ్యాహ్నం భారీగా ట్రాఫిక్ స్తంభించింది. మియాపూర్ నుంచి గండి మైసమ్మ వైపు వెళ్తున్న ఓ టిప్పర్ భౌరంపేట-సూరారం క్రాస్ రోడ్ స్నేక్ పార్క్ వద్ద అదుపుతప్పి రోడ్డుపై నిలిచిపోయింది.
దీంతో ఇరువైపులా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ సమాచారం అందుకున్న జీడిమెట్ల ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. రోడ్డుపై నిలిచిపోయిన టిప్పర్‌ను పక్కకు జరిపి ట్రాఫిక్‌ను క్లియర్ చేయడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.