Ex Sarpanch | శామీర్పేట, జూన్ 2 : శామీర్పేటలో ప్రజా సమస్యలను పట్టించుకునే నాదుడే కరువయ్యాడని, మున్సిపల్ అధికారులు పట్టించుకుని ప్రజా సమస్యలకు పరిష్కారం చూపాలని మాజీ సర్పంచ్ బత్తుల కిశోర్యాదవ్ కోరారు. ఈ మేరకు ఆయన తూంకుంట మున్సిపల్ కార్యాయలంలో సోమవారం కమిషనర్ వెంకటగోపాల్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
శామీర్పేటలో ముదిరాజ్ బస్తీ నుంచి సుభాష్ చంద్రబోస్ విగ్రహం వరకు రోడ్డుపై మురుగునీరు (డ్రైనేజీ వాటర్) పొంగి పొర్లుతుందన్నారు. మురికినీటితో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పాదచారుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరారు.
Medak | ఉద్యోగ, ఉపాధ్యాయుల హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి: టీజీసీపీఎస్ ఈయూ నేత నర్సింహులు
Textbooks | పాపన్నపేట మండలంలో పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసిన ఎంఈవో ప్రతాప్ రెడ్డి