Enumerators | దుండిగల్, మార్చి 18 : కుల గణన (సమగ్ర కుటుంబ సర్వే) నిర్వహించిన ఎన్యుమరేటర్లకు గౌరవ వేతనాలు ఇప్పించాలని పలువురు మహిళలు కోరుతున్నారు. ఈ మేరకు వారంతా ఇవాళ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సాబేర్ ఆలీని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ.. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 33 డివిజన్లలో డివిజన్‌కు 10 మంది చొప్పున మొత్తం 330 మంది ఎన్యూమరేటర్లుగా పనిచేశామన్నారు.
ఒక్కొక్కరు నెలరోజులపాటు శ్రమించి 150 నుండి 180 కుటుంబాల వరకు సర్వే నిర్వహించి కార్పొరేషన్ కార్యాలయంలో అప్పగించామని తెలిపారు. ఎన్యుమరేటర్లకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున గౌరవ వేతనం సర్వే పూర్తయిన పది రోజుల్లోనే చెల్లిస్తామని చెప్పిన అధికారులు ఇప్పటివరకు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే పూర్తయి నాలుగు నెలలు గడుస్తున్న తమకు వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
వేతనాల కోసం ఇప్పటివరకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ నాలుగైదు సార్లు ప్రదక్షిణాలు చేశామన్నారు. ఎన్నిసార్లు అడిగినా ఇదిగో… అదిగో అంటున్నారే తప్ప వేతనాలు మాత్రం ఇవ్వడం లేదన్నారు. ఇదే విషయాన్ని కమిషనర్ సాబేర్ ఆలీ దృష్టికి తీసుకెళ్లిన మహిళలు తమ వేతనాలను ఇప్పించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అందుకు ఆయన స్పందిస్తూ.. శనివారంలోగా ఎన్యుమరేటర్లు వేతనాలు చెల్లిస్తామని హామి ఇచ్చారు.
డాటా ఆపరేటర్ల డబ్బులు ఇవ్వలేదు..
కులగణన పూర్తయిన తర్వాత సేకరించిన పూర్తి సమాచారాన్ని కంప్యూటర్లో ఎంటర్ చేశారు. అయితే వివరాలను కంప్యూటర్లో నమోదు చేసిన ఆపరేటర్‌కు ఒక్కొక్క కుటుంబానికిగాను రూ.20 చొప్పున చెల్లిస్తామని ప్రభుత్వం గతంలోనే పేర్కొంది. కొందరు ఎన్యుమరేటర్లు సర్వే అనంతరం తమకు ఎంతో కొంత గిట్టుబాటు అవుతుందనే ఉద్దేశంతో డేటా ఆపరేటర్లుగాను పనిచేశారు.
డేటా ఆపరేటర్లకు వెంటనే డబ్బులు చెల్లిస్తామన్న అధికారులు ఇప్పటివరకు నయా పైసా చెల్లించలేదన్నారు. ఇలా ఒక్కో డాటా ఆపరేటర్‌కు సుమారుగా రూ.6 వేల వరకు రావాల్సి ఉందన్నారు. అధికారులు ఇప్పటికైనా తమను కార్యాలయం చుట్టూ ఒప్పుకోకుండా వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
MLC Kavitha | బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
Danam Nagender | సహచర ఎమ్మెల్యేలపై దానం నాగేందర్ సీరియస్
Amitabh Bachchan: షారూక్, విజయ్ను దాటేసిన బిగ్ బీ.. 120 కోట్ల ట్యాక్స్ కట్టిన అమితాబ్ బచ్చన్