కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 5: జీవితంపై విరక్తి చెంది ఓ వృద్ధుడు ఇంట్లో ఉన్న చెదలు నివారణ మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఏపీలోని విశాఖపట్నం జిల్లా నక్కపల్లి ప్రాంతానికి చెందిన కొత్త నూకయ్య శెట్టి (61) గత కొంతకాలం కిందట తన భార్య ఇద్దరు కూతుర్లతో కలిసి నగరానికి వలస వచ్చి కుత్బుల్లాపూర్ గణేష్ హౌసింగ్ సొసైటీ కాలనీలో ఉంటున్నాడు.
ఇద్దరు కూతుర్ల పెళ్లిళ్లు చేయడంతో తన భార్య రజినితో కలిసి కాలం వెల్లదీస్తున్నాడు. కాగా, గత కొంత కాలంగా జీవితంపై విరక్తితో ఉన్న నూకయ్య శెట్టి శుక్రవారం రాత్రి ఇంట్లో ఉన్న చెదలు పురుగుల నివారణ మందు సేవించడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.