కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి14: సీఎం రిలీఫ్ ఫండ్(CM Relief Fund) ద్వారా నిరుపేదల ప్రాణాలు నిలుస్తున్నాయని కుత్బుల్లాపూర్ ఎమ్మేల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. సుభాష్ నగర్ డివిజన్ సురారం కాలనీకి చెందిన ఎల్ నాగలక్ష్మి, మాస్టర్ ఎండీ ఫజల్ ఇటీవలే అనారోగ్యంతో బాధపడుతూ ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. కాగా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ను ఆశ్రయించారు. విషయం తెలుసు కున్న ఎమ్మెల్యే సదరు కుటుంబానికి భరోసానిచ్చి ముఖ్యమంత్రి సహాయనిధి పథకం కింద దరఖాస్తు చేయిం చి రూ.2.50 లక్షల విలువగల ఎల్. ఓ .సి. చెక్కులను మంజూరు చేయించారు.
సంబంధిత చెక్కును శుక్రవారం క్యాంపు కార్యాలయంలో మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, కార్పొరేటర్ కె. జగన్తో కలిసి వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సాయం అందించి ఎంతో మంది నిరుపేదలు ప్రాణాలు కాపాడామన్నారు. ఈ కార్యక్రమంలో 126 డివిజన్ అధ్యక్షుడు రుద్రా అశోక్, వేణు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.