కుత్బుల్లాపూర్, డిసెంబర్3 : గాంధీ భవన్ వేధికగా సీఎం రేవంత్‌రెడ్డి దేవుళ్లను ప్రస్తావిస్తూ వ్యంగ్యంగా మాట్లాడిన తీరును నిరసిస్తూ బుధవారం కొంపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రేంవత్ రెడ్డి హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడటం సరైంది కాదన్నారు. సీఎం మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడాలన్నారు.
ఈ కార్యక్రమంలో కొంపల్లి బీజేపీ పట్టణ అధ్యక్షులు పెద్దబుద్దుల సతీశ్ సాగర్, జిల్లా ఉపాధ్యక్షులు ఆదిరెడ్డి రాజిరెడ్డి, కౌన్సిల్ సభ్యులు జనార్ధన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా మోర్చా అధికార ప్రతినిధి సరితారావు, జిల్లా గిరిజన మోర్చ నాయకులు శంకర్‌నాయక్, చక్రధర్, నరిసింహా, మధు, శ్రీకాంత్, జగదీశ్, బాగి, రామిరెడ్డి, తిరుపతి, సందీప్ తదితరులు పాల్గొన్నారు.