Uppal MLA | ఐలమ్మ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి..

చర్లపల్లి : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, తెలంగాణ మలిదశ ఉద్యమానికి స్పూర్తి అయిన చాకలి ఐలమ్మ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర రజక సమితి ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఈసీఐఎల్ చౌరస్తాలోని ఆమె విగ్రహనికి కార్పొరేటర్లు సింగిరెడ్డి శిరీషాసోమశేఖర్రెడ్డి, ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు పావనీమణిపాల్‌రెడ్డి, కొత్త రామారావులతో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మను యువత ఆదర్శంగా తీసుకొవాలని, చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తామన్నారు. అదేవిధంగా చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళలు అర్పించిన అనంతరం ఆమె సేవలను కొనియాడారు.
అనంతరం టీఆర్ఎస్ నాయకులు కాసం మహిపాల్‌రెడ్డి, మణిపాల్‌రెడ్డి, బేతాల బాల్‌రాజు, నాగిళ్ల బాల్‌రెడ్డి, డప్పు గిరిబాబు, పాండాల శివకుమార్‌గౌడ్, రెడ్డినాయక్, రేగిళ్ల సతీష్‌రెడ్డి, గరిక సుధాకర్, కందాడి సుదర్శన్‌రెడ్డి, కొత్త అంజిరెడ్డి, మహ్మద్బాజీబాషా, లక్ష్మినారాయణ, తెలంగాణ రజక సమితి రాష్ట్ర అధ్యక్షుడు పెద్దపురం కుమార్‌స్వామి, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు శనిగరం ఆశోక్, ప్రతినిధులు ముంజంపల్లి రాములు, వెంకటేశ్, కరునాకర్, రవి, శేఖర్, బాలయ్య తదితరులు ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అదేవిధంగా టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీఎస్.బోస్, టీడీపీ నాయకులు టీజీకే.మూర్తి, నాయకులు సాంబమూర్తిగౌడ్, నిర్మల, సతీష్‌బాబు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు శంకర్రావు, సీపీఐ కార్యదర్శి లక్ష్మినారాయణ తదితరులు ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

