పొదుపే శ్రీరామరక్ష.. పెరుగుతున్న ధరలు, తగ్గుతున్న ఆదాయంపై నిపుణుల సలహాలేంటి?
కృత్రిమ మేధస్సు (ఏఐ) అన్ని రంగాల్లో వేగంగా విస్తరిస్తున్నది. ఏఐకి పెద్దపీట వేస్తున్న కంపెనీల యాజమాన్యాలు.. మానవ శక్తిని క్రమేణా తగ్గించుకుంటున్నాయి. ఫలితంగా ఉద్యోగ కోతలు పెరుగుతున్నాయి.
ఓవైపు వాతావరణ మార్పులు, మరోవైపు మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు.. సగటు మనిషి జీవనాన్ని సంక్షోభంలోకి నెడుతున్నాయి. మానవ తప్పిదాలతో కొన్ని, ప్రకృతి ప్రకోపాలతో మరికొన్ని.. ధరల పెరుగుదలకు, ఆదాయం తరుగుదలకు దారితీస్తున్నాయి. మరి.. ప్రస్తుత కరువును, విజృంభిస్తున్న ద్రవ్యోల్బణ పరిస్థితులను అధిగమించడం ఎలా? నిపుణులు ఏం చెప్తున్నారు?
నైపుణ్యాలను పెంచుకోండి
కృత్రిమ మేధస్సు (ఏఐ) అన్ని రంగాల్లో వేగంగా విస్తరిస్తున్నది. ఏఐకి పెద్దపీట వేస్తున్న కంపెనీల యాజమాన్యాలు.. మానవ శక్తిని క్రమేణా తగ్గించుకుంటున్నాయి. ఫలితంగా ఉద్యోగ కోతలు పెరుగుతున్నాయి. ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియని దుస్థితి నెలకొన్నదంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. అందుకే కొత్తగా వస్తున్న నైపుణ్యాలను యువత అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉన్నదని మెజారిటీ పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్తో జాబ్ సెక్యూరిటీ ఉంటుందని గుర్తుచేస్తున్నారు.
రుణాలతో అవసరాలు తీర్చుకోవద్దు
ఇటీవలికాలంలో చాలామంది తమ కెరియర్ ఒడిదుడుకులతో దూరమైన ఆదాయాన్ని రుణాలతో భర్తీచేసి అవసరాలను తీర్చుకోవడం కనిపిస్తున్నది. కానీ ఈ రకమైన తీరు పీకల్లోతు అప్పుల ఊబిలోకి నెట్టగలదు. అలాగే క్రెడిట్ కార్డ్ ఆఫర్ల జోలికి వెళ్లవద్దు. చెల్లింపులు భారంగా మారే ప్రమాదం ఉన్నది. చేతిలో నగదు ఉంటే అనవసరమైన రుణాలను తీర్చేసుకోవడం మంచిది. ముఖ్యంగా ఈఎంఐలలో కొనేందుకు ఆసక్తి చూపవద్దు. ఇది దుబారాకు దారితీయగలదు. వాహన, గృహ కొనుగోళ్లను ఇప్పటికైతే వాయిదా వేసుకోవడమే మంచిది. లోన్లపై ఆధారపడి అస్సలు కొనవద్దు. పర్సనల్ లోన్లకూ దూరంగానే ఉండండి.
పండుగ సీజన్‌తో జాగ్రత్త
ప్రస్తుతం పండుగ సీజన్ నడుస్తున్నది. ఆన్లైన్లో, ఆఫ్‌లైన్‌లో ఎక్కడ చూసినా ఆఫర్లే కనిపిస్తున్నాయి. కనుక ఎదైనా కొనాలనిపిస్తే.. అది మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ముందుగా ఆలోచించడం ఉత్తమం. లేకుంటే మీ కొనుగోళ్లు మరిన్ని వృథా ఖర్చులకు కారణం కాగలవు. ఉన్నదాంట్లో సర్దుకుపోయి.. అత్యవసరమైతే తప్ప కొత్త వాటి జోలికి వెళ్లకపోవడమే తెలివైన నిర్ణయం. అలాగే ప్రతి చిన్న అవసరం కోసం సూపర్ మార్కెట్ల వైపు పరుగులు తీయకండి. ఇంటి దగ్గర్లోని కిరాణా దుకాణాలకు వెళ్తే పొదుపుగా కావాల్సింది మాత్రమే కొనుక్కోవచ్చు. ఇక వీలుంటే ప్రజా రవాణా సదుపాయాలనే (బస్సులు, రైళ్లు, మెట్రో సర్వీసులు) వాడుకోవాలి. వర్షాభావ పరిస్థితులతో ఆహారోత్పత్తుల రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆహారాన్ని వృథా చేయవద్దు.
చివరగా..
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో మిడిల్ ఈస్ట్‌లో ఏర్పడిన ఉద్రిక్తతలు.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్ని పరుగులు పెట్టిస్తున్నాయి. దాదాపు 90 శాతం చమురు దిగుమతులపైనే ఆధారపడ్డ భారత్‌లో.. పెరుగుతున్న క్రూడాయిల్ రేట్లు అనేక సవాళ్లు, ఒత్తిళ్లకు కారణమవుతున్నాయి. అధిక పెట్రోల్, డీజిల్ ధరలతో రవాణా ఖర్చులు భారమై అన్ని వస్తూత్పత్తులు ప్రియమవుతున్నాయి. దీంతో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచుతున్నది చూస్తూనే ఉన్నాం. ఇది వ్యాపార, పారిశ్రామిక రంగాలకు నిధుల కొరతను సృష్టిస్తున్నది. అంతిమంగా దేశ ఆర్థిక ప్రగతికి బ్రేకులు పడుతున్నాయి.
నిపుణుల సూచనలివే..
- అప్పుల జోలికి పోవద్దు
- వృథా ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి
- ఆదాయ వనరులను పెంపొందించుకోవాలి
- అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి
- పొదుపు-పెట్టుబడులకు పెద్దపీట వేయాలి
- జీవిత, ఆరోగ్య బీమాలకు ప్రాధాన్యతనివ్వాలి
- అక్కర్లేని వేడుకలకు దూరంగా ఉండాలి
- అనవసరమైన ప్రయాణాలను మానుకోవాలి
- నీటిని దుర్వినియోగం చేయవద్దు
- ఇంధనం-విద్యుత్తును ఆదా చేయాలి
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

