MLA KP Vivekananda | దుండిగల్, ఫిబ్రవరి 21 : మహా శివరాత్రి పర్వదిన వేడుకలను పురస్కరించుకొని ఈ నెల 26వ తేదీన దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేటలోని శ్రీశ్రీశ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరగనుంది. ఈ వేడుకకు హాజరు కావాలంటూ బీఆర్ఎస్ పార్టీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందను ఆయన నివాసంలో కలిసి ఆలయ సిబ్బంది ఆహ్వాన పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో బౌరంపేట్ ప్రాధమిక వ్యవసాయ సహకార పరపర సంఘం (పిఎసిఎస్) చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, ఆలయ అధ్యక్షులు సురేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శేఖర్ ముదిరాజ్, ఉపాధ్యక్షులు శంకరప్ప ,కోశాధికారి ప్రశాంత్ రెడ్డి ,సభ్యులు రామచంద్రారెడ్డి ,పాండురంగ గుప్తా ,నామాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీలోని శ్రీ శ్రీ శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ దేవస్థానం ఆధ్వర్యంలో ఈనెల 24 నుంచి మూడు రోజులపాటు జరగనున్న శివరాత్రి వేడుకల్లో పాల్గొనాలంటే ఆలయ కమిటీ ప్రతినిధులు శుక్రవారం ఎమ్మెల్యే వివేకానంద కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. అంతకుముందు వివిధ ప్రాంతాలకు చెందిన సంక్షేమ సంఘాల నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఎమ్మెల్యే వివేకానందను మర్యాదపూర్వకంగా కలిశారు.