ఉప్పల్, ఆగస్టు: బోనాల ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తామని చిలుకానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్ అన్నారు. బోనాల పండుగ సందర్భంగా డివిజన్లోని మర్లమైసమ్మ, పోచమ్మ, మజ్జిగౌరమ్మ ఆలయాలను సందర్శించారు. ఈమేరకు ఆలయాల వద్ద రోడ్డు మరమ్మతు పనులు చేయించారు.
అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండ చూడాలని, భక్తులు మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించేలా చూడాలన్నారు. బోనాలపండుగను ఘనంగా నిర్వహించుకోవాలని, అమ్మవారి ఆశీస్సులతో కరోనా నుంచి విముక్తి లభించాలని కోరుకోవాలన్నారు. భక్తులు, డివిజన్ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, ఏదుల్ల కొండల్‌రెడ్డి, వీబీ.నర్సింహా, మాస శేఖర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.