దుండిగల్, ఆగస్టు :కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని అక్రమనిర్మాణాలకు చెక్‌పెట్టారు మున్సిపాలిటీ టౌన్‌ఫ్లానింగ్ అధికారులు. మున్సిపాలిటీ పరిధిలోని బహదూర్‌పల్లిలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న షెడ్లతో పాటు డీ.పోచంపల్లి, రాజరాజేశ్వరీకాలనీ, ఇంద్రానగర్ కాలనీ తదితర ప్రాంతాలల్లో అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్దంగా నిర్మిస్తున్న బహుళ అంతస్థుల భవనాలను శనివారం మున్సిపల్ టౌన్‌ఫ్లానింగ్ సిబ్బంది సీజ్ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో అనుమతులులేకుండా, నిబంధనలకు విరుద్దంగా నిర్మించే భవనాలు,షెడ్లపై చర్యలు తప్పవన్నారు. భవననిర్మాణ దారులు టీఎస్‌బీపాస్ నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చట్టప్రకారం చర్యలు తప్పవన్నారు.