ధీరజ్ స్వర్ణ చరిత్ర
ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత యువ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన పురుషుల రికర్వ్ విభాగంలో స్వర్ణ పతకంతో సత్తాచాటాడు. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో షూటాఫ్ ద్వారా తేలిన ఫలితంలో ధీరజ్ 10-9తో జపాన్‌కు చెందిన నకనిషి జున్యను ఓడించాడు. తొలుత ఐదు సెట్లలో (28-28, 28-29, 29-28, 28-30, 28-27) స్కోర్లు 5-5తో సమమవగా షూటాఫ్‌లో ధీరజ్ ప్రత్యర్థిని చిత్తుచేశాడు.
- ప్రపంచకప్‌లో పసిడి కైవసం
సాల్టిలో (మెక్సికో): ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత యువ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన పురుషుల రికర్వ్ విభాగంలో స్వర్ణ పతకంతో సత్తాచాటాడు. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో షూటాఫ్ ద్వారా తేలిన ఫలితంలో ధీరజ్ 10-9తో జపాన్‌కు చెందిన నకనిషి జున్యను ఓడించాడు. తొలుత ఐదు సెట్లలో (28-28, 28-29, 29-28, 28-30, 28-27) స్కోర్లు 5-5తో సమమవగా షూటాఫ్‌లో ధీరజ్ ప్రత్యర్థిని చిత్తుచేశాడు.
తద్వారా ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో పతకం గెలిచిన తొలి పురుష ఆర్చర్‌గా అతడు రికార్డులకెక్కాడు. దుబాయ్ వేదికగా 2007లో జరిగిన ఎడిషన్‌లో మహిళా ఆర్చర్ డోలా బెనర్జీ స్వర్ణం పతకం నెగ్గింది. ఆ తర్వాత 19 ఏండ్ల పతక నిరీక్షణకు తెరదించుతూ ఈ టోర్నీలో భారత్‌కు పసిడిని అందించాడు. 2023, 2024 ఎడిషన్లలోనూ ఈ తెలుగు కుర్రాడు ఫైనల్స్‌కు అర్హత సాధించినా ఉత్తచేతులతోనే వెనుదిరిగినా తాజా ఎడిషన్‌లో మాత్రం స్వర్ణంతో చరిత్ర సృష్టించడం గమనార్హం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
‘దొరికింది దొరికినట్లే దోచుకుంటున్నారు’
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

