ప్రస్తుతం బాలీవుడ్లో ఆలియాభట్ ప్రభ ఓ స్థాయిలో వెలుగుతున్నది. ఓ వైపు స్టార్డమ్ని, మరోవైపు కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తూ ఆనందకరమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారామె. తాజాగా ఓ ప్రైవేట్ ఈవెంట్లో పాల్గొన్న ఆలియా.. ‘కావాలని ఇతరులకు కోపం తెప్పించడం, లేదా చిరాకు పుట్టించడం’ అనే అంశంపై మాట్లాడుతూ తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. ‘చిన్నతనంలో మా అక్క షాహీన్ నిరంతరం నన్ను కోపానికి గురిచేసేది.
నాకింకా బాగా గుర్తు.. నాకు నాలుగేళ్లు ఉన్నప్పుడు ‘నువ్వు అమ్మానాన్నలకు సొంత బిడ్డవు కావు. పార్లే-జి బిస్కెట్ ప్యాకెట్ కొంటే ఫ్రీగా నిన్ను ఇచ్చారు’ అని చెప్పి ఏడిపించేది. ఆమె సరదాగా అంటున్న ఆ మాటలను నిజమే అనుకుని ఏడ్చేదాన్ని. ఇప్పుడు ఆ క్షణాలు గుర్తొస్తే నవ్వొస్తుంది. ఏదేమైనా ఇలాంటి చిలిపి గొడవలే అక్కాచెల్లెళ్ల బంధాలను బలోపేతం చేస్తాయని నా నమ్మకం’ అని గుర్తు చేసుకున్నారు ఆలియా. ప్రస్తుతం ‘డోంట్ బీ షైన్’ అనే సినిమాను నిర్మిస్తున్న అలియా.. లవ్ అండ్ వార్, తుంబాడ్2 చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.