హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటిస్తున్న ప్రేమకథా చిత్రం ‘తెల్ల కాగితం’. రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ కొమ్మాలపాటి నిర్మాత. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా నుంచి ‘తెలుసా తెలుసా’ అంటూ సాగే మెలోడీ గీతాన్ని అగ్ర హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు.
విజయ్ బుల్గానిన్ స్వరపరచిన ఈ పాటకు సురేష్ బనిశెట్టి సాహిత్యాన్ని అందించారు. అనుదీప్, లిప్సిక ఆలపించారు. ఈ పాటలో నాయకానాయికల మధ్య కెమిస్ట్రీతో పాటు విజువల్స్ హైలైట్గా నిలిచాయి. హృద్యమైన ప్రేమకథ ఇదని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, మాటలు: నందు సవిరిగాన, దర్శకుడు: రమేష్ బండ్రెడ్డి.