CM Overseas Scholarship | మేడ్చల్ కలెక్టరేట్, జూన్ 2 : విదేశీ విశ్వవిద్యాలయాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డాక్టోరల్ కోర్సులను అభ్యసించడానికి స్కాలర్షిప్ ( ఆర్ధిక సహాయం) మంజూరు కోసం అర్హత కలిగిన మైనారిటీ విద్యార్థుల నుండి ఆన్ లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటి సంక్షేమ శాఖ అధికారి కాంతమ్మ ఒక ప్రకటనలో తెలిపారు.
విశ్వవిద్యాలయాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టోరల్ కోర్సులలో 01.01.2025 నుండి 30.06.2025 వరకు ప్రవేశం పొంది, అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన విద్యార్థులు www.telangana epass.cgg.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.ఈ నెల 1వ తేది నుండి ఈ పాస్ పోర్టల్ తెరిచి ఉంటాయని, ఈ నెల 30వ తేది సాయంత్రం 5 గంటల వరకు కలెక్టరేట్లోని మైనార్టీ కార్యాలయంలో అందించాలని చెప్పారు.
హార్డ్ 34 కాపీలు, అవసరమైన పత్రాలను సమర్పించడానికి చివరి తేది జులై 31 అని తెలిపారు. స్కీమ్ వివరాలు, అర్హత ప్రమాణాలు, దరఖాస్తు చేయాల్సిన దేశాలు, అర్హతలు ఈ పాస్ వెబ్సైట్లో ఉన్నాయని ఇతర వివరాలకు మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా మైనార్టీ కార్యాలయంలో లేదా ఫోన్ నంబర్లు 9492037940/9000168256 సంప్రదించాలని సూచించారు.
Medak | ఉద్యోగ, ఉపాధ్యాయుల హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి: టీజీసీపీఎస్ ఈయూ నేత నర్సింహులు
Textbooks | పాపన్నపేట మండలంలో పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసిన ఎంఈవో ప్రతాప్ రెడ్డి