BAS Admissions | మేడ్చల్ కలెక్టరేట్, జూన్ 4 : ఈ విద్యా సంవత్సరం 2025-26కి గానూ గిరిజన బాలబాలికల బెస్ట్ అవైలబుల్ స్కూల్ (BAS)లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. జిల్లాలోని 35 సీట్లు ఉన్నాయని, అందులో మూడో తరగతిలో 17 సీట్లు, ఐదో తరగతిలో 9 సీట్లు, ఎనిమిదో తరగతిలో 9 సీట్లు కేటాయించామని పేర్కొన్నారు.
గిరిజన తెగలకు చెందిన లంబాడా, ఎరుకల, ఇతర ఉప- కులాలకు చెందిన విద్యార్థినీవిద్యార్థులు ఈ నెల 17వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ సూచించారు. ఈ నెల 9వ తేది నుంచి 13వ తేది వరకు కలెక్టరేట్లోని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఉచితంగా దరఖాస్తు ఫారములు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కులం, ఆదాయం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ప్రస్తుతం చదవుతున్న పాఠశాల నుంచి బోనఫైడ్ సర్టిఫికెట్, రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలతో దరఖాస్తులు అందజేయాలని అన్నారు. ఈ నెల 15వ తేదీలోపు ఈ దరఖాస్తులను అందజేయాలని, గిరిజన విద్యార్థినీవిద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు ఫోన్ నెం. 99591 59629 సంప్రదించాలని సూచించారు.