Drainage Problem | కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 9 : బాలాజీ నగర్ డివిజన్లోని అంబేద్కర్ నగర్ కాలనీలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ పగడాల శిరీష కోరారు. ఈ మేరకు ఇవాళ జలమండలి ఎండీ అశోక్ రెడ్డిని కలిసిన కార్పొరేటర్ శిరీష వినతి పత్రాన్ని అందించారు.
ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ.. అంబేద్కర్ నగర్ కాలనీ, ముల్లకత్వ చెరువు పక్కన నూతనంగా కూకట్పల్లి కోర్టు ప్రాంగణాన్ని నిర్మించడం జరిగిందన్నారు. ఈ కోర్టును నిర్మించడంతో అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన డ్రైనేజీ అవుట్ లైన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందన్నారు. దీంతో డ్రైనేజీ నీరు కాలనీ నుంచి బయటికి వెళ్లకుండా ఆగిపోతుందని తద్వారా కాలనీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఈ సమస్యను పరిష్కరించాలంటే కోర్టు ప్రాంగణం గుండా కొత్తగా డ్రైనేజ్ అవుట్ లైన్ పైప్ లైన్ ను వేయాలన్నారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని… లేదంటే రానున్న వర్షాకాలంలో అంబేద్కర్ నగర్ కాలనీ ముంపుకు గురవుతుందని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించి, సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరారు. దీనికి జలమండలి ఎండి సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బాబురావు ఉన్నారు.
BRS | ఇది పెండ్లి పత్రిక కాదు..! బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఆహ్వాన పత్రిక..!!
MLA Kadiyam Srihari | ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటనలో అపశృతి.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
TG Weather | తెలంగాణలో మరో మూడురోజులు వానలే.. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ