శామీర్‌పేట, మార్చి 22 : ఆలియాబాద్-మజీద్‌పూర్ గ్రామాల మధ్య ఉన్న రహదారిని కబ్జా నుంచి కాపాడాలని ఆలియాబాద్ గ్రామస్తులు, బీఆర్ఎస్ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిని శనివారం తన క్యాంప్ కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా స్థానిక బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ.. అలియాబాద్, మజీద్‌పూర్ గ్రామాల మధ్య ఉన్న గ్రామ నక్ష రోడ్డును కొందరు కబ్జా చేసి గేటు ఏర్పాటు చేశారని తెలిపారు. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వారి అవసరాలను గుర్తించి రోడ్డును తిరిగి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషిచేయాలని కోరారు. స్థానికుల విజ్ఞప్తిపై ఎమ్మెల్యే మల్లారెడ్డి సానుకూలంగా స్పందించారు. తహశీల్దార్‌తో ఫోన్లో మాట్లాడిన సమస్యను పరిశీలించి, పరిష్కార మార్గాలు చూపాలని సూచించారు.