Tenth Exams | మేడ్చల్ కలెక్టరేట్, మార్చి 19 : ఈ నెల 21వ తేదీ నుంచి మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా పది పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల నిర్వహణ నిమిత్తం 230 కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 47930 విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారని డీఈఓ విజయకుమారి ఒక ప్రకటనలో తెలిపారు.
47322 మంది విద్యార్థులు రెగ్యులర్ కాగా 608 మంది విద్యార్థులు ప్రైవేట్‌గా పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ నెల 21 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగే పరీక్షలు ఉదయం 9:30 నిమిషాల నుండి మధ్యాహ్నము 12.30 నిమిషాల వరకు ఉంటాయని, సైన్స్ పేపర్‌కు సంబంధించి పార్ట్- I భౌతిక శాస్త్రం, పార్ట్- II జీవశాస్త్రము వేర్వేరు తేదీలలో ఉదయం 9:30 నుండి 11:00 గంటలకు వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. హాల్ టికెట్లను సంబంధిత పాఠశాలలకు అందించామని, విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయుల నుండి హాల్ టికెట్లను పొందాలని సూచించారు. www.bsetelangana. వెబ్ సైట్ నుండి విద్యార్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకుని పరీక్షలు హాజరు కావాలని తెలిపారు.