Action plan | శామీర్ పేట్, మే 29 : 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో ప్రజలకు మెరుగైన సేవలందించాలని తూంకుంట మునిసిపల్ కమిషనర్ ఆర్ వెంకట్ గోపాల్ అన్నారు. కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాల మేరకు తూంకుంట మునిసిపల్ సమావేశ మందిరంలో 100 రోజుల కార్యచరణ ప్రణాళిక తయారుపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్బంగా కమిషనర్ ఆర్ వెంకట్ గోపాల్ మాట్లాడుతూ.. ప్రణాళిక రూపకల్పనకు వార్డు అధికారులు సంబంధించిన వార్డుల్లో పర్యటించి సమస్యలు గుర్తించాలన్నారు. అనంతరం సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించడం లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ శ్రావణ్ కుమార్, డిప్యూటీ ఈఈ సునీత, ఆర్ ఓ అర్షద్ అహ్మద్, ఆర్ ఐ లు భాస్కర్, రేణుక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
PM Modi | ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేవారికి ఆపరేషన్ సిందూర్ తగిన సమాధానం : ప్రధాని మోదీ
Sunkishala | సిటీకి సుంకిశాలే శరణ్యం.. కేసీఆర్ దిశలోనే కాంగ్రెస్ సర్కారు
Navy plane Crashes | ఘోర ప్రమాదం.. కూలిన నేవీ విమానం